విద్యార్థి మందు సేవించి విద్యార్థి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ మూడవ టౌన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.ఎస్ఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం. కమ్మర్ పల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి రామవత్ శేఖర్(19). ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుకున్నాడు.ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ లో స్నేహితులతో కలిసి రూం తీసుకొని ఉంటున్నారు.
ఈ క్రమంలో గత నెల క్రితం తండ్రి అయిన రమవత్ లింబద్రి కి ఫోన్ చేసి రూ.2 లక్షలు తీసుకున్నారని తండ్రి తెలిపాడు. గత కొన్ని రోజులుగా తండ్రి లింబాద్రి తో కూడా మాట్లాడండం లేదని తండ్రి వాపోయాడు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి పురుగుల మందు సేవించి విద్యార్థి ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ పేర్కొన్నారు.విద్యార్థి మృతి కి గల కారణాలు తెలియాల్సి ఉంది.