ప్రమాదవశాత్తు మురికి కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని రెండవ టౌన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.ఎస్ఐ రామ్ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ నగరంలోని కోటగళ్లి చివాస్ వైన్స్ ప్రక్కన ఉన్న మురికి కాలువలో గుర్తు తెలియని వ్యక్తి పడి మృతి చెందినట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు మృతుని వయస్సు (30) సంవత్సరాలు ఉంటుదని తెలిపారు.అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.