ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి…ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన ఘటన నసుర్లబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
ఎస్ఐ లావణ్య తెలిపిన వివరాల ప్రకారం బోధన్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పోతాడి నవీన్ రెడ్డి(40). వృత్తి రీత్యా ఓ ప్రైవేట్ బ్యాంక్ లో ఫైనాన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు.మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.
శనివారం రాత్రి వృతి రీత్యా హైదరాబాద్ వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో బాన్సువాడ నుంచి బోధన్ కు వెళ్తున్నా మధ్య మార్గంలో నేమ్లి సాయి బాబా గుడి సమీపంలో భారీ వర్షం కారణంగా ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు.
అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆదివారం ఉదయం కుటుంబీకులకు సమాచారం అందించారు.దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లావణ్య వెల్లడించారు.
