HomeTelanganaNizamabadఅధికార లాంఛనాలతో ముగిసిన డీఎస్ అంతక్రియలు

అధికార లాంఛనాలతో ముగిసిన డీఎస్ అంతక్రియలు

మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ అంతక్రియలు అశ్రునయనాల మధ్య ఆదివారం మధ్యాహ్నం ముగిసాయి. పోలీసులు గౌరవ వందనం చేసారు.

మూడు రౌండ్ ల గాలిలో కాల్పులు జరిపారు. పెద్దకొడుకు మాజీ మేయర్ సంజయ్ తండ్రి దహన సంస్కారాలు నిర్వహించారు . మాదవనగర్ శివారు లోని బైపాస్ రోడ్డు లో డీఎస్ సొంత భూమి లో అంతక్రియలు జరిపారు.

మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక వాహనంలో డీఎస్ పార్థివదేహం ను నిజామాబాద్ నగరంవీధులద్వార వెళ్ళింది. వేలాది మంది డీఎస్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు అంతిమ యాత్రకు తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం మే నిజామాబాద్ చేరుకున్నారు.

ఆయన బేగంపేట్ నుంచి హెలిక్యాపిటర్ లో వచ్చారు కలెక్టరేట్ కార్యాలయంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో నేరుగా డీఎస్ ఇంటికి చేరుకున్నారు.

డీఎస్ పార్థవదేహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు.. అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ మేయర్ సంజయ్ లను పరామర్శించారు.

ఈ సందర్భంగా వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం రేవంత్ తోపాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీఎస్ కు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్.. డీఎస్ క్రమశిక్షణ కలిగిన నాయకుడన్నారు. కాంగ్రెస్ కు ఆయన చేసిన సేవలు మరవలేరన్నారు.

కార్యకర్త స్థాయి నుంచి పీసీసీ చీఫ్ వరకు ఎదిగారని.. తెలంగాణ ఏర్పాటుకు ఆయన ఎంతో కృషి చేశారు. డీఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పారు

///వెలువెత్తిన పరామర్శలు ////

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. హైదారాబాద్ లో శనివారం మృతి చెందగా రాత్రి ఏడుగంటలకు ఆయన పార్థివదేహం ను నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ లో ఆయన ఇంటికి తరలించారు.

కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ నిజామాబాద్ వచ్చి డీఎస్ కు నివాళులు అర్పించి ఎంపీ అర్వింద్ ను పరామర్శించారు .

అర్బన్ ఆర్మూర్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ ,పైడి రాకేష్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు v.హనుమంతు రావు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కార్యకర్తలు, అభిమానులు ,అశ్రునయనాలతో తుది విడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, కాంగ్రెస్,బిజెపి, కార్యకార్తలు స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ కి అంతిమ వీడ్కోలు పలికారు.

అభిమాన నేతను కడసారి చేసేందుకు జనం భారీ ఎత్తున తరలి వచ్చారు.

అక్కడే ఉన్న శ్రీనివాస్ చిన్న కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్,నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ లను పరామర్శించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments