మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది ఆ పార్టీలో తెలంగాణ నేతల ప్రస్థానం నా మాత్రంగా మారనుంది అగ్రనేతలు నలుగురు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ అలియాస్ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ బడే చొక్కారావు ఇలియాస్ దామోదర్, స్టేట్ కమిటీ మెంబర్ నూనె నర్సింహా రెడ్డి అలియాస్ గంగన్న అలియాస్ సన్ను దాదా లొంగిపోయారు.
మంగళవారం ఈ నలుగురిని డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు . ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణలో మొదలైన మావోయిస్టు ఉద్యమం తెలంగాణలోనే ఆఖరి దశకు వచ్చిందన్నారు.
ఈ పరిణామంతో ఆ పార్టీ అత్యున్నత స్థాయి సంస్థాగత నిర్మాణం, తెలంగాణ రాష్ట్ర కమిటీ పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో చేరిపోవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఈ నలుగురు అజ్ఞాతం వీడినట్లు తెలిపారు. వీరిపై ఉన్న మొత్తం 90 లక్షల నగదు రివార్డు డీడీ రూపంలో డీజీపీ అందజేశారు
