పేకాట ఆడుతున్న పది మంది జూదారులను పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఆరవ టౌన్ ఎస్ఐ వెంకటరావు తెలిపారు.ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..
శాస్త్రి నగర్ గ్రామ శివారులో కొంత మంది పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు స్థావరం పై దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారి నుంచి రూ 76000 నగదు,కారు,రెండు ద్విచక్ర వాహనాలు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటరావు తెలిపారు.
