HomeCRIMEబ్యాంకు దోపిడీ యత్నం ప్రయత్నించిన వ్యక్తికి ఏడేళ్ల జైలు….

బ్యాంకు దోపిడీ యత్నం ప్రయత్నించిన వ్యక్తికి ఏడేళ్ల జైలు….

బ్యాంకు దోపిడీ యత్నించిన కేసులో నిందితుడి మీద అభియోగాలు రుజువు కావడంతో ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తు మొదటి అదనపు జడ్జి కనుక దుర్గ తీర్పు చెప్పారు .ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 2024జనవరి 1 రాత్రి11 గంటలకు సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బ్యాంక్ బ్యాంకు షటర్ ధ్వంసం చేసి బ్యాంకులో ప్రవేశించారు కానీ సీసీ కెమెరాల నుంచి నోటిఫికేషన్ అందుకున్న బ్యాంకు మానేజర్ బనోత్ రాజు అప్రమత్తం అయ్యారు.

బ్యాంకు లో ఓ వ్యక్తి చొరబడి నట్లుగా తన ఫోన్ లో ఉన్న సీసీ కెమెరా ల లింక్ దృశ్యాలు చూపెట్టాడు. దీనితో గ్రామస్థులతో కలిసి వెంటనే బ్యాంకు కి వెళ్లి న మేనెజర్ బ్యాంకు లో చొరబడిన ఆలూరి సంతోష్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు ధర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నిందితుడి మీద అభియోగాలు నమోదు చేశారు ఈ కేసు ను మొదటి అదనపు జిల్లా కోర్టు లో విచారణకు వచ్చింది.

నిందితుడు సంతోష్ దోపిడి యత్నం,ప్రాపర్టీ డ్యామేజ్ నేరాల చేసినట్లుగా రుజువు అయింది. దీనితో అతనికి 7 సంవత్సరాల జైలు శిక్షను మూడు వేల రూపాయల జరిమానా విధిస్తు తీర్పు ఖరారు చేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments