HomeCRIMEకూలి పోయిన ఎయిర్ ఇండియా విమానం ……వంద మందికి పైగా మృతి …….విమానం లో 57...

కూలి పోయిన ఎయిర్ ఇండియా విమానం ……వంద మందికి పైగా మృతి …….విమానం లో 57 మంది విదేశీయులు

గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే జనావాసాల్లో కూలింది.

ప్రమాదం సంభవించిన వెంటనే దట్టమైన మంటలు ఎగిసిపడి అన్ని వైపులా పొగ వ్యాపించింది. దీంతో విమానంతో పాటు పరిసర ప్రాంతాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 240 మందికి పైగా ప్రయాణికులు ఉండగా.. దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

12 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఏయిర్‌పోర్ట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటన చేశారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి అన్ని విమాన సర్వీసులు నిలిపివేశారు.

మధ్యాహ్నం 1.39 సమయంలో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేకాఫ్ టైమ్‌లో ఒక్కసారిగా సివిల్‌ ఆసుపత్రి సమీపంలోని బీజె మెడికల్ కాలేజీ బిల్డింగ్,ఫై విమానం ముందు భాగం కూలింది .

ఈ ఘటనలో మెడికల్ కాలేజ్ బిల్డింగ్ తోసహ రెండు భారీ భవనాలకు మంటలు అంటుకున్నాయి. కాగా ఈ ఘటనలో 20 మందికి పైగా మెడీకోలు అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం.


మధ్యాహ్న సమయం కావడంతో పెద్ద ఎత్తున పీజీ స్టూడెంట్స్ భోజనానికి రాగా..

ఆ సమయంలోనే ఒక్కసారిగా ఫ్లైట్ బిల్డింగ్ పై కూలిపోయింది.

విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 మంది పోర్చుగీస్, ఒక కెనడియన్ ఉన్నారు. అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ ప్రాంతానికి సమీపంలో విమానం కూలిపోయింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కనిపించింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments