ఇటీవల భారీ వర్షలతో నష్ట పోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎకరానికి రూ 50 వేలు ఆర్థిక సహాయం చెయ్యాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేసింది.
సోమవారం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ను ప్రతినిధి బృందం కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు ఈ బృందంలో..
రాష్ట్ర అధ్యక్షులు. వి ప్రభాకర్. రాష్ట్ర కార్యదర్శి. బి దేవారం.. జిల్లా అధ్యక్షులు. సారా సురేష్. ప్రధాన కార్యదర్శి. బాబన్న. కార్యదర్శి బి కిషన్ లున్నారు.
ఈ సందర్భంగా. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతి పై 11 శాతం ఉన్న పన్నును రద్దు చేయడం మూలంగా 60 లక్షల పత్తి రైతుల ఆర్థిక స్థితిపై భారం పడి పత్తి కొనుగోలు చేసే దిక్కే ఉండదని ఆత్మహత్యల వైపు తమ ప్రయాణం కొనసాగుతుందని గుర్తు చేశారు ఒకవైపు రైతాంగానికి పెద్ద ఎత్తున ఆదుకుంటానని హామీలు ఇస్తూనే రైతు నష్టపరిచే విధానాలకు అంగీకారం తెలియజేయడం సరికాదని అన్నారు.
రైతాంగాన్ని నష్టపరిచి కార్పోరేట్ వ్యాపార వర్గాలకు లాభం చేకూర్చే విధంగా నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకురావడానికి రైతు వ్యతిరేక చర్యని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాలలో ఇసుక మేట వేసిన భూములకు లక్ష రూపాయల నష్టపరిహారం.
అన్ని పంటలకు 50 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలు పరిష్కారం కానీ ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు…
