Sunday, April 26, 2026
HomeDevotionalశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ఊరేగింపులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు మరియు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

.శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయ కమిటీ వారు నిర్వహించిన భారీ ఊరేగింపులో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు.

బాద్ నగరంలో నిర్వహించిన ఈ ఊరేగింపులో వేలాదిగా ఆర్యవైశ్య సోదర సోదరీమణులు భారీ సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ ఊరేగింపును విజయవంతం చేశారు.

ఈ ఊరేగింపు నగేశ్వర ఆలయం నుండి ప్రారంభమై పెద్దబజార్ మీదుగా కిషన్ గంజ్‌లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వరకు కొనసాగింది.ఊరేగింపులో పాల్గొన్న భక్తజనులందరూ అమ్మవారి నామస్మరణతో భక్తిశ్రద్ధలతో ముందుకు సాగారు.

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు కిషన్ గంజ్‌లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.ఆలయంలో అమ్మవారి నామకరణ డోలరోహణ మహోత్సవంలో పాల్గొని ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!