HomeTelanganaNizamabadఇందూర్ లో మరోసారి ఎగిరిన కాషాయం జెండా .....ఎంపీ రెండో సారి అర్వింద్ గెలుపు ....90...

ఇందూర్ లో మరోసారి ఎగిరిన కాషాయం జెండా …..ఎంపీ రెండో సారి అర్వింద్ గెలుపు ….90 వేల పై చిలుకు ….గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ ……..అర్బన్ బోధన్ జగిత్యాల్ సెగ్మెంట్ లలో కాంగ్రెస్ ఆధిక్యం …….రూరల్ ఆర్మూర్ బాల్కొండ కోరుట్ల లో బీజేపీ ప్రభంజనం …….కారు కు డిపాజిట్ గల్లంతు ?

ఇందూర్ కోట మీద కాషాయ జెండా ఎగిరింది నిజామాబాద్ లోకసభ స్థానంనుంచి బీజేపీ అభ్యర్థి . ధర్మపురి అర్వింద్ రెండో సారి ఎంపీ గా భారీ మెజార్టీ తో గెలుపొందారు. ఆయన దాదాపు 92 వేల పై చిలుకు మెజారిటీ తో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మీద గెలిచారు. బిఆర్ యస్ పార్టీ అభ్యర్థి నామాత్రం గా వోట్లు సాధించారు.

ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లున్న నిజామాబాద్ లోకసభ నియోజకవర్గంలో అర్వింద్ అన్ని రౌండ్ లలోనూ మెజార్టీ సాధిస్తూ వచ్చారు. కోరుట్ల, బాల్కొండ ఆర్మూర్ నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ లలోఅర్వింద్ మెజార్టీ సాధిస్తే బోధన్ అర్బన్ లో జీవన్ రెడ్డి భారీగా వోట్లు సాధించారు.

జగిత్యాల్ లో నూ జీవన్ రెడ్డి స్వల్ప మెజార్టీ సాధించారు. 2019 ఎన్నికల్లో మొదటి సారిగా తెరాస అభ్యర్థి కవిత మీద సంచలన విజయం సాధించిన అర్వింద్ రెండో సారి కూడా సునాయాసంగా గెలిచారు. నిజానికి కనీసం రెండు లక్షల మెజార్టీ లక్ష్యంగా అర్వింద్ పక్క కార్యాచరణ తో ఎన్నికల కార్యక్షేత్రం లో దిగారు.

కానీ చివరి లో కాంగ్రెస్ చాపకింద నీరులా బలపడింది. మరో వైపు బిఆర్ యస్ శ్రేణులు ముఖ్యంగా ముస్లిం మైనారిటీ లు గంప గుత్తగా కాంగ్రెస్ వైపు వచ్చేసారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ లో బీజేపీ భారీ మెజార్టీ తో గెలిచింది. కానీ ఎంపీ ఎన్నికల్లో లీడ్ సాధించలేక పోయింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments