లోకసభ ఎన్నికల ఫలితాల్లో దేశవ్యాప్తంగా బీజేపీ సానుకూల ఫలితాలు సాధించలేక పోయినా తెలంగాణలో గతంలో కన్న మెరుగైన స్థానాలు సాధించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో హోరాహోరీగా తలపడింది. మొత్తం 17 లోకసభ స్థానాల్లో కాంగ్రెస్ 8 బీజేపీ 8 స్థానాలు సాధించే దిశగా ఉన్నాయి.
యంఐయం హైదారాబాద్ లోకసభ స్థానం నిలబెట్టుకోనుంది. నల్గొండ భువనగిరి ఖమ్మం వరంగల్ ,మహబూబాద్. నగర్ కర్నూల్ , పెద్దపల్లి. జహీరాబాద్ నియోజకవర్గాలలో గెలుపు ఖాయం అయింది.
ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మల్కాజిగిరి, చేవెళ్ల మహబుబ్ నగర్ .సికింద్రాబాద్ మెదక్ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు దిశగా దూసుకెళ్తుంది