కారు జోరుకు బ్రేకులు వేసిన కమలం
మధ్యాహ్నం రెండు వరకు సుమారు 10 రౌండ్లు కౌంటింగ్ పూర్తి
ఫలితాలపై ఓటర్లలో నెలకొన్న ఉత్కంఠ
జాన రమేష్: ఇది సంగతి : ఆర్మూర్ : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ లో కమలం వికసించింది. కౌంటింగ్ లో మొదటి రౌండ్ నుండి చివరి రౌండ్ వరకు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి బిజెపి అభ్యర్థి అరవింద్ కు గట్టి పోటీ ఇచ్చారు. గతంలో ఓ వెలుగు వెలిగిన బి ఆర్ ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మొదటి రౌండ్ నుండి చివరి రౌండ్ వరకు త్రిబల్ డిజిట్లోనే పరిమితం అయ్యారు.
ఇలా పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా మారి ద్విముఖ పోరును తలపించింది. ఇక బి ఆర్ ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ ఎ ఒక్క రౌండ్ లో కూడా తన ఆధిక్యం చాటుకోకుండ చతికిల పడ్డారు. మొత్తం 15 రౌండ్ లలో 1500 టేబుల్ లను కౌంటింగ్ ప్రక్రియ కోసం ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే బాజిరెడ్డి గోవర్దన్ కౌంటింగ్ కేంద్రము నుండి బయటకు వెళ్లిపోయారు.
చివరి రౌండ్ మిగిలి ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కౌంటింగ్ సెంటర్ బయటకు వచ్చి మీడియా ప్రతినిధుల తో మాట్లాడుతూ … బిజెపి , బి ఆర్ ఎస్ పార్టీలు కుమ్మకై తన ఓటమికి కారణం అయ్యాయని అన్నారు. అయినగానీ రాష్ట్రంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి సహకారముతో నెరవేరుస్తానని చెప్పారు. అలాగే మెట్ పల్లి సమీపంలోని ముత్యం పేట్, బోధన్ చెరుకు కర్మగారల పునరుద్దరణకు కృషి చేస్తానని అన్నారు. ప్రజల తీర్పు గౌరవిస్తానని వివరించారు.
కౌటింగ్ కేంద్రమైన నిజామాబాద్ జిల్లాలో డిచ్పల్లి శివారులోని సీఎంసి కళాశాల వద్ద జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ ఆఫ్ పోలీస్ కల్మేశ్వేర్ ల పర్యవేక్షణలో సీఎంసీ కళాశాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తు పెద్ద ఎత్తున పోలీసు బందబస్తును ఏర్పాటు చేసి పొలింగ్ కేంద్రానికి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో వాహన రాక పోకలు దారి మళ్లించారు.
ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రశాంతయుత వాతావరణములో కాంటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఇందు కోసం కంతింగ్ కేంద్రానికి వచ్చే ఏజెంట్లు, మీడియా ప్రతినిధుల కొసం ప్రత్యేక వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేసి వసతులు కల్పించారు.
ఇలా రెండవ సారి సైతం బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ అనధికార లెక్కల ప్రకారం సుమారు లక్ష ముప్పది నాలుగు వేల పైచిలుకు మెజారిటీ సాధించి తన పైచేయి చాటుకున్నారు.