అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆరుమాసాల్లో జరిగిన లోకసభ ఎన్నికల్లో అంచనాల మేరకే ఫలితాలు వచ్చాయి. సిట్టింగ్ స్థానం నిజామాబాద్ లోకసభ నియోజకవర్గంలో మరోసారి విజయం సాధించింది.కానీ బిఆర్ యస్ పార్టీ ఎవ్వరి అంచనాలకు అందనంతగా వోట్ల ను కోల్పయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా మూడు అసెంబ్లీ సెగ్మెంట్ లను గెలిచి నాలుగున్నర లక్షల పై చిలుకు వోట్లు సాధించింది.
కానీ లోకసభ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా సాధించలేక బొక్కబోర్లా పడింది. కేవలం లక్ష ఓట్లకే పరిమితం అయ్యింది. కానీ బిఆర్ యస్ సాంప్రదాయ వోట్ల ను సైతం కోల్పోయింది. బిఆర్ యస్ వోట్లను ఏ పార్టీ కొల్లగొట్టిందనేది ఆసక్తిగా మారింది. దాదాపు మూడున్నర లక్షల వోట్ల ను బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దాదాపు చేరి సగం పంచేసుకున్నాయి. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ కేవలం మూడు లక్షల పై చిలుకు వోట్లే సాధించింది.
కానీ అర్వింద్ కు 5 .96 లక్షల వోట్లు వచ్చాయి. అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే అదనంగా రెండున్నర లక్షల వోట్లు బీజేపీ కి వచ్చాయి. గత లోకసభ ఎన్నికల కంటే కూడా బీజేపీ కి లక్ష వోట్లు ఎక్కువగా వచ్చాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు లక్షల ఓట్లు పొందిన కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మించే వోట్లు కొల్లగొట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ బోధన్ సెగ్మెంట్ లలో బిఆర్ యస్ కు వోట్లు వేసిన మైనారిటీ లు లోకసభ ఎన్నికలో గంప గుత్తగా కాంగ్రెస్ వేశారు. అందుకే ఆ రెండు సెగ్మెంట్ లలో కాంగ్రెస్ బీజేపీ కన్న ఎక్కువగా వోట్లు సాధించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ లో బిఆర్ యస్ 39 వేల వోట్లు సాధిస్తే ఈసారి 8 వేల వోట్లే వచ్చాయి. దాదాపు 30 వేల ఓట్లను కోల్పయింది. అందులో కాంగ్రెస్ 12 వేలు బీజేపీ 13 వేల వోట్లు కు వెళ్లాయి. నిజామాబాద్ అర్బన్ లో 44 వేల వోట్లు వస్తే ఇప్పుడు 7 వేల వోట్లే వచ్చాయి. కానీ బీజేపీ అసెంబ్లీ లో 73 వేల వోట్లు వస్తే ఇప్పుడు ఏడు వేలు అదనంగా అంటే 80 వేలు వోట్లు సాధించింది.
కాంగ్రెస్ కు దాదాపు 60 వేల వోట్లు వస్తే ఇప్పుడు 96 వేల వోట్లు వచ్చాయి . 30 వోట్లు ఎక్కువగా వచ్చాయి.అంటే బిఆర్ యస్ కు వోటు బ్యాంకు గా ఉన్న మైనారిటీ లు గంప గుత్తగా కాంగ్రెస్ కు వెళ్లాయి. అంటే అర్బన్ లో బిఆర్ యస్ వోట్ల ను కాంగ్రెస్ ఎక్కువగా పొందింది. బోధన్ లో ఇదే సిన్ జరిగింది. కానీ ఈ సెగ్మెంట్ లో బీజేపీ ఎక్కువగా లబ్ది పొందింది. అసెంబ్లీ కన్న 36 వేల వోట్లు అదనంగా వచ్చాయి.
అదే కాంగ్రెస్ కు 16 వేల వోట్లే అదనంగా సాధించింది. కానీ బిఆర్ యస్ 54 వేల వోట్లు కోల్పోయింది.బిఆర్ యస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ లోనూ ఇదే జరిగింది. 50 వేల వోట్లు కోల్పయింది. బీజేపీ కూడా సైతం 50 వేల వోట్లు అదనంగా వచ్చాయి. కాంగ్రెస్ కు 12 వోట్లే అదనంగా వచ్చాయి.