కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చినందుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు పిసిసి ఆదేశాల మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ల ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది.
అనంతరం గాంధీ విగ్రహం ముందు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి,ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) 2005 ఆగస్టు 23న చట్టంగా ఆమోదించబడి, 2006 ఫిబ్రవరి 2 నుండి అమలులోకి వచ్చిందనీ, గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజుల ఉపాధిని హామీ ఇస్తుందనీ ఆయన అన్నారు.
కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం MGNREGA స్థానంలో ‘వికసిత్ భారత్- గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్’ (VB-G RAM-G) అనే కొత్త పథకం తెచ్చి పేద ప్రజల కడుపు కొడుతుంది అని అన్నారు. ప్రస్తుతం దేశంలో నరేంద్ర మోడీ అంశాలకు గాంధీ పేరు వింటేనే భయం మొదలవుతుంది అని, భారత స్వాతంత్ర పోరాటంలో గాంధీ గారు కీలకపాత్ర పోషించడం జరిగిందని, గాంధీ పేరును దేశంలో రూపుమాపడానికి బీజేపీ ఎన్నో కుట్రలు చేస్తుందని అందులో భాగంగానే ఉపాధి హామీ పథకం పేరు మార్చి దాన్ని విధానాలను మార్చే ప్రయత్నం చేస్తుందని, కానీ ఈ దేశానికి గాంధీ చేసిన సేవలు ఎన్నటికీ దేశ ప్రజలు మరువలేరు అని, దేశ ప్రజల గుండెల్లో గాంధీ గారి పేరు ఎన్నటికి చిరస్థాయిలో నిలచిపోతుందని నగేష్ రెడ్డి అన్నారు.
ఇప్పటికే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తుందని, దానికి బిజెపికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఆలోచనతో రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికల్లో బిజెపికి గుణపాఠం చెప్పడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో బిజెపి చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించి కచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తామని, బిజెపి ఎన్ని కుట్రలు చేసినా దేశంలో గాంధీ గారి పేరును రూపుమాపలేరు అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ గారు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కల్పించాలని 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని, దీని ద్వారా ఎంతో మందికి పని దొరికిందని, ఉపాధి హామీ పథకం ద్వారా అనేక తండాల్లో గ్రామాల్లో 40% అభివృద్ధి పనులు జరిగాయని, మోడీ రద్దు చేసిన ఉపాధి హామీ పథకం లాగానే మహాత్మా గాంధీ గారి ఫోటో ఉన్న పది రూపాయల నుండి 500 రూపాయల నోట్లను రద్దు చేసి చూపించాలని, మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి అని బిజెపి కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ గారిని కాకుండా గాడ్సే ను దేవుడుగా పూజిస్తున్నారని ,జాతీయ జెండాను స్వాతంత్రం వచ్చినంక కూడా అంగీకరించని ఆర్ఎస్ఎస్ బాబాజాలాలు ఉన్న బిజెపి దేశానికే ప్రమాదం అని, బిజెపి ఎల్లప్పుడు మతం పేరుతో దేశం విభజించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారని ఆయన అన్నారు.
ఈ సందర్బంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ, ఆనాటి గాంధి గారి గ్రామస్వరాజ్యాన్ని స్పూర్తిలో నుండి వచ్చిందే MNREGA (మహాత్మాగాంధి నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ఆక్ట్) 2, ఫిబ్రవరి 2006, న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, CM YS రాజశేఖర్ రెడ్డి గారు, UPA చైర్ పర్సన్ సోనియా గాంధీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న కొప్పుల రాజు గారు అనంతపూర్ లో ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు.
ప్రజల లోపల ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చిందని, శ్రామిక వర్గాలు, భూమి లేని పేదలకు, మహిళల్లో ప్రాముఖ్యతకు దోహదపడింది చెప్పారు.ఇప్పటి BJP సర్కార్ పేరు మార్చే ప్రక్రియలో వారు తెచ్చిన పాలసీ MNREGA విషయంలో తూట్లు పొడిచేలాగా ఉందని. వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆండ్ అజీవిక మిషన్ గ్యారంటీ బిల్ తేవడం జరిగిందని చెప్పారు.MNREGA ని G RAM G మధ్య తేడా చుస్తే గత 2 దశాబ్దాలుగా 100 రోజుల పని కల్పించడం ద్వారా మహిళలు, శ్రామికులు, భూమి లేని వ్యవసాయ కూలీలు ఆర్థికాభివృద్ధి చెందడం జరిగింది.
తద్వారా ఆస్తుల సృష్టీకరణ జరిగింది. వ్యవసాయ సుస్థిరతకు, కూలీలకు ఆదాయ వనరులను సమకూర్చుకోవడం MNREGA తోడ్పడినది. భూమి లేని పేదలకు ఇదొక ఆసరాగా ఉన్నది, ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పథకంలో నీటి నిలువ నిర్మాణాలు, సాగునీటి కాటకాలు, చెక్ డ్యామ్ లు, నేల సంరక్షణ పనులు, గ్రామీణ రహదారులు, తోటలు, వ్యవసాయ పనులు పునరుద్దించడం మొదలైన వాటిని పని చేయించడం జరిగింది.
ఇందులో మహిళలు ఎక్కువగా పాల్గొని మగవారితో సమానంగా వేతనం పొందేవారని పేర్కొన్నారు. ఉపాది హామీ పథకములో 100% కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేసేవని, కానీ BJP తెచ్చిన గ్రామీణ బిల్ లో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వాల నిష్పత్తిలో విభజించడం ద్వారా బిల్ ను పక్క దారి పట్టించేలాగా ఉందని చెప్పారు. ఇప్పటికే అరకొర నిధులకే ఆపసోపాలు పడుతున్న రాష్ట్రాలు 40% అదనపు భారాన్ని మోసే స్థితిలో ఎంతవరకు ఉన్నాయో గమనించవలసిన విషయం అన్నారు.
తద్వారా బిల్లులు చెల్లించే ప్రక్రియ ఆలస్యం కావచ్చు, అలాగే పనిదినాల కల్పనలో కోతలకు గురికావచ్చు, నిరుపేదలకు ఇబ్బంది కావడంవలన వారు వేరే ప్రత్యామ్నాయాలకోసం వెళ్లే క్రమంలో ఇందునుండి వారు మినహాయింపు అయ్యే అవకాశాలే ఎక్కువని పేర్కొన్నారు. స్పష్టంగా చెప్పాలంటే ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకే గ్రామీణ బిల్ ఉంది.
డిజిటల్ AI పద్ధతి ద్వారా ఎంతవరకు భద్రత కలిగి ఉంటుందో చూడాలన్నారు. కొత్త విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా 100 రోజుల పనిదినాలను 125 కు పెంచాం అంటున్నారు, 2024 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 150 రోజుల పనిదినాలు కల్పిస్తాం అని చెప్పడం జరిగిందని అన్నారు.ఈ బిల్లులో తెచ్చిన కొత్త నిబంధనల కారణంగా రాష్ట్రంపై ఏటా రూ.1,737 కోట్ల వరకు అదనపు భారం పడనున్నది.
పనుల సంఖ్యను బట్టి ఈ భారం మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఇప్పటికే ఆదాయ, వ్యయాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అప్పులతో పూడ్చుతూ వస్తున్న తెలంగాణకు.. మోదీ మోపిన అదనపు భారం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, గ్రంధాలయ చైర్మన్ అంత రెడ్డి రాజారెడ్డి, ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, జిల్లా ఫిషరీస్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, వేల్పూరు నర్సారెడ్డి, ముప్కల్ ముత్యం రెడ్డి, ధర్పల్లి బలరాజ్,మోర్తాడ్ రాములు, దొంకేశ్వర్ భూమేష్,నగర మహిళా అధ్యక్షురాలు రేవతి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు గన్రాజ్ ,నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మొయిన్, మైనార్టీ అధ్యక్షులు ఎజాజ్, పూల ఉష, చంద్రకళ, విజయలక్ష్మి ,ప్రీతం, రాజేంద్రప్రసాద్, అష్రఫ్,మలైకా, శుభం, మహేందర్, రమేష్, రాజ్ గగన్, బాలనర్సయ్య, రాజేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
