HomeTelanganaNizamabadభగవద్గీతతో ప్రజాసేవకు మార్గదర్శనం..వారాహి మాత ఆలయ చైర్మన్ జ్ఞానేందర్ చేతుల మీదుగా మోపాల్ సర్పంచ్‌కు శుభాకాంక్షలు

భగవద్గీతతో ప్రజాసేవకు మార్గదర్శనం..వారాహి మాత ఆలయ చైర్మన్ జ్ఞానేందర్ చేతుల మీదుగా మోపాల్ సర్పంచ్‌కు శుభాకాంక్షలు

ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని, భగవద్గీత బోధనలు ప్రజాప్రతినిధులకు జీవన మార్గదర్శకంగా నిలుస్తాయని వారాహి మాత ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ అన్నారు.

మోపాల్ గ్రామానికి నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ రవికుమార్, వార్డు సభ్యులు మహేష్, నవీన్ రెడ్డి, బీజేపీ నాయకులు ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని వారాహి మాత ఆలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ జ్ఞానేందర్ నూతన సర్పంచ్ రవికుమార్‌కు భగవద్గీతను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

భగవద్గీత కేవలం ఒక ధార్మిక గ్రంథం మాత్రమే కాకుండా, ధర్మం, కర్తవ్యబోధ, న్యాయం, నిస్వార్థ సేవ వంటి విలువలను బోధించే మహాగ్రంథమని ఆయన పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులు భగవద్గీతలోని బోధనలను ఆచరణలో పెట్టినప్పుడే సమాజంలో సార్థకమైన మార్పు సాధ్యమవుతుందని అన్నారు.

ఇప్పటివరకు భగవద్గీత 7,600 ప్రతులను వివిధ ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులకు పంపిణీ చేసినట్లు జ్ఞానేందర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ధార్మిక చైతన్యం పెంపొందడంతో పాటు, సేవాభావం మరింత బలపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

నూతన సర్పంచ్ రవికుమార్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నిజాయితీతో, పారదర్శకంగా పనిచేస్తానని తెలిపారు. భగవద్గీత ఇచ్చిన ప్రేరణతో ధర్మబద్ధంగా, వివక్షలేకుండా గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.

వార్డు సభ్యులు మహేష్, నవీన్ రెడ్డి కూడా గ్రామ సమస్యల పరిష్కారానికి సమిష్టిగా పనిచేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

భగవద్గీతతో ప్రజాసేవకు మార్గదర్శనంవారాహి మాత ఆలయ చైర్మన్ జ్ఞానేందర్ చేతుల మీదుగా మోపాల్ సర్పంచ్‌కు శుభాకాంక్షలు

ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని, భగవద్గీత బోధనలు ప్రజాప్రతినిధులకు జీవన మార్గదర్శకంగా నిలుస్తాయని వారాహి మాత ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ అన్నారు.

మోపాల్ గ్రామానికి నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ రవికుమార్, వార్డు సభ్యులు మహేష్, నవీన్ రెడ్డి, బీజేపీ నాయకులు ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని వారాహి మాత ఆలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ జ్ఞానేందర్ నూతన సర్పంచ్ రవికుమార్‌కు భగవద్గీతను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. భగవద్గీత కేవలం ఒక ధార్మిక గ్రంథం మాత్రమే కాకుండా, ధర్మం, కర్తవ్యబోధ, న్యాయం, నిస్వార్థ సేవ వంటి విలువలను బోధించే మహాగ్రంథమని ఆయన పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులు భగవద్గీతలోని బోధనలను ఆచరణలో పెట్టినప్పుడే సమాజంలో సార్థకమైన మార్పు సాధ్యమవుతుందని అన్నారు.ఇప్పటివరకు భగవద్గీత 7,600 ప్రతులను వివిధ ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులకు పంపిణీ చేసినట్లు జ్ఞానేందర్ తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా ధార్మిక చైతన్యం పెంపొందడంతో పాటు, సేవాభావం మరింత బలపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.నూతన సర్పంచ్ రవికుమార్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నిజాయితీతో, పారదర్శకంగా పనిచేస్తానని తెలిపారు.

భగవద్గీత ఇచ్చిన ప్రేరణతో ధర్మబద్ధంగా, వివక్షలేకుండా గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. వార్డు సభ్యులు మహేష్, నవీన్ రెడ్డి కూడా గ్రామ సమస్యల పరిష్కారానికి సమిష్టిగా పనిచేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments