నూతనంగా నియామకమైన సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులకు ఈరోజు బార్ అసోసియేషన్ మరియు స్టేట్ గవర్నమెంట్ ప్లీడర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా బార్ అధ్యక్షులు సాయి రెడ్డి గారు మరియు జిపి సుదర్శన్ గారు మాట్లాడుతూ ఒకేసారి నిజామాబాద్ బార్ నుండి ఆరుగురికి అవకాశం కల్పించడం చాలా సంతోషించదగ్గ విషయమని, భవిష్యత్తులో మంచి స్థానాలో ఎదగాలని ఆకాంక్షించారు.
అనంతరం నియామకమైన సభ్యులు సాయిరెడ్డి,బండారి. కృష్ణానంద్, ఆకుల సురేష్, మల్లెపూల జగన్మోహన్ గౌడ్,దయావర్ నాగేష్ పదేగేలవెంకటేష్ గార్ల ను శాలువాలతో సత్కరించి మిఠాయిలు తినిపించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బార్ కార్యదర్శి మాణిక్ రాజ్, నారాయణ దాస్, సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, రమాదేవి,ప్రవీణ, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు
