అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమి రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం ముదక్ పల్లి గ్రామ శివారులో అక్రమంగా గంజాయి రవాణా బహదూర్ ను పట్టుకొని అతని వద్ద నుంచి సుమారు 300 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అలాగే అతని వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం,సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు.
ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ నారాయణ రెడ్డి, భూమన్నా,రాజన్న, కానిస్టేబుల్లు విష్ణు,అవినాష్,ఉత్తమ్, ఆశన్న, తదితరులు ఉన్నారు.
