నిజాయితీకి మారుపేరుగా, ప్రజా సమస్యల గొంతుకగా నిలుస్తున్న ‘ఇది సంగతి’ దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆయన కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు.
క్యాలెండర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తాయని, వార్తలను వాస్తవ రూపంలో ప్రజలకు అందించడంలో ‘ఇది సంగతి’ పత్రిక తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ దినపత్రిక దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందాలని ఆయన కోరారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పత్రిక ఎడిటర్ సూరన్న గారి నర్సాగౌడ్, క్రైమ్ బ్యూరో టేక్మల్ జగదీష్ తో పాటు పత్రికా ప్రతినిధులు,సలీం, తమలపాకుల గంగాధర్, ఉల్లెంగ నాగరాజు, జావిద్, జాఫర్, అజీమ్ కురేసి,సుంకరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
