Monday, December 8, 2025
HomeTelanganaNizamabadఎస్సారెస్పీలోకి పోటెత్తిన వరద ....

ఎస్సారెస్పీలోకి పోటెత్తిన వరద ….

ఎగువగోదావరి మహారాష్ట్రలో భారీ వర్షాల తో పొచం పాడ్ ప్రాజెక్ట్ కు వరద పోటెత్తింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి తో పాటు స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోనికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఈ వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 18518 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1067.40 అడుగుల నీటిమట్టం ఉంది ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు రావడంతో ఆయకట్టు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి . ఈ ఖరీఫ్ సీజన్లో ఆశాజనకంగా పంటలు పండుతాయి అని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!