HomeTelanganaNizamabadజర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..ఘనంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం..

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..ఘనంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం..

సమాజంలో నాలుగో స్తంభమైన పత్రికా వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

సోమవారం నగరంలోని బసవ గార్డెన్‌లో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ.. ఒక నాయకుడు ఎదగాలన్నా, ప్రజా సమస్యలు వెలుగులోకి రావాలన్నా మీడియా సహకారం ఎంతో అవసరమని అన్నారు.కీలక పాత్ర: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, క్షేత్రస్థాయి లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలోనూ జర్నలిస్టులు వారధిగా ఉండాలని కోరారు.

ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, ఎమ్మెల్సీగా జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తాం: షబ్బీర్ అలీఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

జిల్లా పాత్రికేయుల చిరకాల కోరికైన ఇళ్ల స్థలాల అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన కొలిక్కి తెస్తామని హామీ ఇచ్చారు.జర్నలిస్టుల హెల్త్ కార్డుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని వెల్లడించారు.

టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం పాకులాడకుండా, వార్తల సేకరణలో వాస్తవాలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. పేదల గొంతుకగా నిలవాలని నూతన కార్యవర్గానికి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లాలోని సీనియర్ జర్నలిస్టులు, వివిధ పత్రికల ప్రతినిధులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments