నామినేషన్ గడువు దగ్గర పడుతుంది. ఎండల వేడి తగ్గింది …ఎన్నికల ప్రచారం జోరు కానుంది ……ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం చేయడానికి అతిథి లు జిల్లాకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
లోకసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ లు వేయడానికి మరో మూడు రోజుల గడవే ఉంది. బీజేపీ బిఆర్ యస్ అభ్యర్థులు ఈపాటికే ఓ సెట్ నామినేషన్ దాఖలు చేసారు. కాంగ్రెస్ అభ్యర్థి సోమవారం నామినేషన్ వేయనున్నారు.ప్రధాన పార్టీ లకు అభ్యర్థుల ప్రచారం ఇంకా ఉపందుకోలేదు .ఏ హడావుడి హంగామాలు లేకుండా సాగుతున్నాయి. తీవ్రమైన ఎండల తో అభ్యర్తలే కాలు బయటపెట్టని పరిస్థితి.
ఉండే కానీ రెండు రోజులుగా ఈదురు గాలులు ..అకాల వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అభ్యర్థిలకు ఎంతో ఉపశమనం కలిగి నట్లు అయింది. సోమవారం నుంచి ప్రధాన పార్టీల ప్రచారం మరింత ఉదృతం కానుంది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు ఎన్నికల ప్రచారంలో భాగంగా వస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రేవంత్ రెడ్డి వస్తున్నారు. ఈ సందర్భంగా పాత కలెక్టరేట్ మైదానం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. లోకసభ నియోజకవర్గాల్లో అన్ని సెగ్మెంట్ లనుంచి భారీఎత్తున ప్రజలను ఈ సభ కు తరలిస్తున్నారు. రేవంత్ సీఎం అయ్యాక మొదటి సారిగా జిల్లాకు వస్తుండడం తో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సహం నెలకొంది. మరో వైపు నేతలు కూడా ఈ సభ సక్సెస్ చేయడానికి శ్రమిస్తున్నారు.
మరోదఫా ఆయన జిల్లాకు వచ్చి ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉంది. మరో వైపు బీజేపీ అభ్యర్థి అర్వింద్ మరోసారి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బిఆర్ యస్ సైతం భారీ ఎన్నికల ప్రచారానికి ప్రణాళిక వేసింది. కేటీఆర్ హరీష్ రావు లతో పాటు వచ్చే నెల 6 అధినేత కెసిఆర్ బస్సు యాత్ర జిల్లాకు రాబోతుంది.
ఆయన రోజంతా జిల్లాలో రోడ్ షో లు చేయనున్నారు. రాత్రి ఇక్కడే బస చేసి ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే రెండు వారాలు జిల్లాలో అతిథులు సందడి చేయబోతున్నారు