HomeDevotionalనిమజ్జన రథం కు చారిత్రాత్మక నేపథ్యం .......స్వాతంత్ర పోరాట స్ఫూర్తి తో కదిలిన యువకులు .....కాలినడకతో...

నిమజ్జన రథం కు చారిత్రాత్మక నేపథ్యం …….స్వాతంత్ర పోరాట స్ఫూర్తి తో కదిలిన యువకులు …..కాలినడకతో మొదలు పెట్టి రథం తో సాగుతున్న శోభాయాత్ర …..

ప్రతియేటా తొమ్మది రోజుల పాటు గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా నగరంలో నిమజ్జనం నాడు జరిగే రథయాత్ర ను తిలకించడానికి వేలాది మంది కన్నుల పండగ గా తిలకిస్తారు.

సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని దుబ్బాలో గల శ్రీ సిద్ది బుద్ధి సహిత మహా గణపతి మందిరం నుంచి మొదలయ్యే రథ యాత్ర కు చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది.

ఉవ్వెత్తున సాగుతున్న స్వాతంత్ర పోరాట స్ఫూర్తి తోనే ఈ రథ యాత్ర సరిగ్గా 80 ఏళ్ళ క్రితం పది యువకులు కలిసి మొదలు పెట్టారు. యువత లో దేశభక్తి ని పదుకొల్పడానికే ముంబయి లో బాలగంగాధర్ తిలక్ ఈ ఉత్సవాలను ఓ వేదిక గా చేసుకున్నారు అదే నిజామాబాద్ లో ఉన్న పది మంది యువకులకు ఓ ప్రేరణ గా నిలిచింది.

అంతే పాలకుల ఆంక్షలను సైతం ధిక్కరించి సార్వజనిక గణేష్ మండలి 1944లో వ్యవస్థాపక ట్రస్టును ఏర్పాటు చేశారు.

అందులో కాశీనాథ్ రావు ముప్కాల్ క, పి నరసింహారావు, గంజుల పోశెట్టి, కిషన్ దాస్, మురళీధర్ అటల్, మురళీధర్ శర్మ, మారుతి రావు పవర్, ముక్క చంద్రశేఖర్ గుప్తా, పాట్కూరి యెగొండ స్వామి, బాపూరావు కుబేర్కర్,బంటు రంచొడ్ లాల్ లు ఈ ట్రస్ట్ ను కేవలం గణేష్ ఉత్సవాల నిర్వహణ కోసమే ఏర్పాటు చేసారు .

మొదట రథం ఉండేది కాదు గణపతి ప్రతిమలను నగరంలో అయిదారు చోట్ల మాత్రమే పెట్టేవారు తొమ్మది రోజు ఆ విగ్రహాలను ఆయా మండలి ల యువకులు చేతుల మీదే మోసుకొని.

ఈ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు గా వెళ్లి నగర శివారులో వ్యవసాయ భూమిలో ఓ మోట బావి లో విగ్రహాలను నిమజ్జనం చేసేవారు ఆ తర్వాత దుబ్బ ప్రాంత లో కొందరు రైతులు ఎడ్ల బండి లను అలకరించి అందులనే గణనాధులను తీసుకెళ్లేది .

ఆ తరువాత ఎడ్లుబండ్లు సరిపోకపోవడంతో అప్పుడే వచ్చిన ట్రాక్టర్లు ట్రాలీ మీద తీసుకెళ్లారు. ఆ తర్వాత ప్రముఖ ఫర్టిలైజర్స్ కంపెనీ ఆర్థిక సహకారంతో 1975 వ సంవత్సరంలో కట్టే తోనే భారీ రథం అందుబాటులోకి తెచ్చారు.

ఆ కట్టే రథం కు ఎడ్ల ను కట్టి లాగే వారు 2016లో సార్వజనిక్ మండలి నిర్వాహకులు విశాలమైన రథం ను తయారు చేయించారు. ప్రస్తుతం అదే రథం ఉంది.

ఈ ఊరేగింపు దుబ్బాక నుంచి మొదలుకొని రైల్వే గేటు మీద నుంచి గాంధీ చౌక్ నుంచి నెహ్రూ పార్క్ నుంచి పవన్ టాకీస్, గురుద్వార్,గాజుల్పేట్, గోల్ హనుమాన్, పాటీ గల్లి, పూలంగ్, చివరగా వినాయక్ నగర్ లోని వినాయకుల బావిలో నిమజ్జనం జరుగుతుంది.

ఈ ఊరేగింపులో పోలీసు భద్రత యంత్రాంగం చాలా పటిష్టంగా ఏర్పాట్లు చేస్తుందని పేర్కొన్నారు. గతంలో ఊరేగింపు ఎడ్లపై జరిగినప్పుడు 45 జతల ఎడ్లు ఉండేవని అధ్యక్షుడు బంటు గణేష్ పేర్కొన్నారు.

కానీ వ్యవసాయం లో ఎడ్ల బండ్ల కనుమరుగు అయిపోవడంతో దశాబ్ద కాలంగా రథం లాగడానికి ఎడ్లను సమకూర్చడం కష్ట తరం అయింది. కానీ ఆనవాయితీగా కొనసాగించాలనే పట్టుదలతో పొరుగు ఉన్న మహారాష్ట్ర నుంచి 10 నుంచి 15 ఎడ్ల జతలఎడ్లను అద్దె కు తెప్పిస్తున్నారు .

సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించే గణేష్ నిమజ్జన ఊరేగింపులో జిల్లాలోని ప్రజలు అందరూ సహకారాలు అందించి మత సామరస్యంగా జరుగుతుందని అలాగే ముస్లిం లు కూడా పాల్గొని సేవ కార్యక్రమాలు చేసుకుంటారని బంటు గణేష్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments