ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం.. గురువన్న పేట లోజరిగింది . గ్రామస్తుల కథనం మేరకు గురువన్న పేట గ్రామానికి చెందిన యువకుడు ఎడో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేశాడు.
బాధితురాలు ఇంట్లో చెప్పడంతో కోపోద్రిక్తులు అయ్యారు గ్రామస్థులతో కలిసి నిందితుడి ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఇంటికి నిప్పు పెట్టారు.
అలాగే పలు వాహనాలు ధ్వంసం చేశారు. పోలీసులు హుటాహుటిన వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు.
అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కొమురవెల్లి పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు నమోదు చేశారు.
