HomeDevotionalబోధన్ వంద స్తంభాల గుడి ని రక్షించాలి.

బోధన్ వంద స్తంభాల గుడి ని రక్షించాలి.

బోధన్ పట్టణంలోని వంద స్తంభాల గుడిని సంరక్షించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో కు మంగళవారం రోజున. వినతి పత్రం అందజేశారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న 100 స్తంభాల గుడి వద్ద అసాంఘిక శక్తులు చేపడుతున్న చర్యలపై సబ్ కలెక్టర్ కు హిందూ సంఘాలు వివరించారు.

గుడి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ మతానికి చెందిన. దర్గా ను. ఏర్పాటు చేయడం తో హిందూ సంఘాలు సబ్ కలెక్టర్ ను కలిసి సమస్య తెలియజేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరికాదని అసాంఘిక శక్తుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కొందరు ఈ ప్రాంతాన్ని దర్గాకు చెందినదిగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వినతిపత్రంలో ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.

వినతి పత్రం అందజేసిన వారిలో బిజెపి పట్టణ అధ్యక్షులు బాలరాజు జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి బిజెపి ఫ్లోర్ లీడర్ మాసిన వినోద్ , పట్టణ ప్రధాన కార్యదర్శి వాసు తదితరులు ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments