ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పాలనా అస్తవ్యస్తంగా మారుతుంది. దశాబ్ద కాలంగా ఇంచార్జ్ పాలనే దిక్కయ్యింది.
గతంలో పలుమార్లు డాక్టర్లు ప్రొఫెసర్లకు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రెగ్యులర్ సూపరింటెండెంట్ గా నియమిస్తూ పదోన్నతులు ఇచ్చిన అందుకు వారు పదవులనే సైతం వదులుకున్నారు కానీ బాధ్యతలు మాత్రం చేపట్టలేరనే దాఖలు ఉన్నాయి.
నిజామాబాద్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ పదవి అంటేనే ఆమ్మో అంటూ డాక్టర్లు ప్రొఫెసర్లు జంకుతున్నారు. ఉన్నత స్థాయి ఉద్యోగులు,రాజకీయ నేతలు పైరావీలు ఉంటాయని వెనుకడుగు వేస్తున్నారు.
ఎట్టకేలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ మాల కొండారెడ్డిని నియమిస్తూ వైద్య ఆరోగ్య, ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్య దర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్రూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వులు జారీ చేసి 10 రోజులు కావస్తున్న ఆయన బాధ్యతలు చేపట్టకపోవడంతో ఆసుపత్రిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ గా ఉన్న మాలకొండరెడ్డి నిజామాబాద్ సూపరింటెండెంట్ గా పదోన్నతులపై బదిలీ చేశారు.
అందుకు ఆయన నిజామాబాద్ రావడానికి ఆసక్తిగా లేరని వాదనలో గట్టిగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన సూపరింటెండెంట్ ప్రొఫెసర్లు ప్రిన్సిపాల్ లు ఉత్తర్వులు జారీచేసిన నాటి నుంచి 15 రోజులలో బాధ్యతలు స్వీకరించాలని చెప్పింది.
అయినా ఆయన ఇప్పటివరకు బాధ్యతలు చేపట్టకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు బాధ్యతలు చేపడతారా? లేదా? అనేదానిపై జిల్లా ఆసుపత్రులలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ మేరకు జిల్లా ఆసుపత్రిలో ఇంకొన్నాళ్ళు ఇంచార్జ్ పాలనే దిక్కయ్యేలా ఉందని ఆరోపణలు వెలుగుతున్నాయి.
