HomeCRIMEపెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి..

పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి..

సీఎంఆర్ అక్రమాలపై ఉక్కుపాదం మోపండి వైట్ కాలర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలిప్రమాదాల నివారణకు ‘బ్లాక్ స్పాట్స్’ గుర్తింపుక్రైమ్ రివ్యూ మీటింగ్‌లో సీపీ పి. సాయి చైతన్య ఐపీఎస్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు.

మంగళవారం నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని కేసుల పురోగతిపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.

కస్టమ్ మిల్లింగ్ రైస్ కుంభకోణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో దర్యాప్తును ముమ్మరం చేయాలని సీపీ ఆదేశించారు. సాక్ష్యాల సేకరణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని, కోర్టుల్లో పక్కాగా ప్రాసిక్యూషన్ నిర్వహించి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు.

ముఖ్యంగా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని సూచించారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్స్, నకిలీ పత్రాల వంటి వైట్ కాలర్ నేరాలపై సీపీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ తరహా నేరాలను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలనీ అన్నారు.అలాగే దర్యాప్తులో అత్యాధునిక సాంకేతికతను జోడించాలి. ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలనీ పేర్కొన్నారు.రోడ్డు భద్రత – ప్రాణ రక్షణే లక్ష్యంరోడ్డు ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలనీ, రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు ఉంటే నేషనల్, స్టేట్ హైవే అధికారులతో మాట్లాడి సరి చేయించాలనీ అన్నారు.

ముఖ్యంగా ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు.. ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్‌లపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్)బస్వా రెడ్డి, ఏసీపీలు రాజ వెంకటరెడ్డి (నిజామాబాద్), శ్రీనివాస్ (బోధన్), మస్తాన్ అలీ (ట్రాఫిక్), వై. వెంకటేశ్వరరావు (సైబర్ క్రైమ్), స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం, సీసీఆర్‌బీ సీఐ రమేష్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments