HomeHEALTHముంచుకొస్తున్న మాయదారి మహమ్మారి......అప్రమత్తం అయినా యంత్రాంగం .......ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పట్లు

ముంచుకొస్తున్న మాయదారి మహమ్మారి……అప్రమత్తం అయినా యంత్రాంగం …….ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పట్లు

మాయదారి మహమ్మరి కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతుంది.యంత్రాంగం మరోసారి ఉలిక్కి పడుతుంది. అప్రమత్తం అయ్యారు వైరస్ కట్టడి కోసం కార్యాచరణ కు సిద్ధం అవుతున్నారు.

మూడు దఫాలుగా ముంచెత్తిన కరోనాచాప కింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో జాతీయ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాలు జారీచేసింది. కోవిద్ 19 కు సంబందించిన జాగ్రత్త లు పాటించాలని పేర్కొంది.

కానీ ఈసారి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రభావం చూపుతుంది.ఈ వేరియంట్ ఎలా వ్యాపిస్తున్నది ? వైరస్ తాలుకు లక్షణాల మీద కూడా వైద్య ఆరోగ్య శాఖ ను అప్రమత్తం చేసింది.

ఆందోళన చెందొద్దు అంటూనే తేలిక మాత్రం తీసుకోవద్దని చెప్తుండడంతో మరోసారి కరోనా డేంజర్ బెల్ మోగినట్లుగా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి వైద్యాధికారులు తెలిపారు.

ఈ వార్డులో 10 బెడ్ లు మహిళలు, 10 బెడ్ లు పురుషుల కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్, వెంటిలేటర్ లతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

కరోనా లక్షణాలు ఉంటే ఆసుపత్రికి రావాలని వారు రావాలని రక్త నమూనా లను పరీక్షించుకొవాలని కోరుతున్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments