HomeTelanganaNizamabadనవోదయ కు ఎట్టకేలకు తొలిగిన అడ్డంకులు ….కాలిగోట్ వద్దే ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ……ఫలించిన ఎంపీ...

నవోదయ కు ఎట్టకేలకు తొలిగిన అడ్డంకులు ….కాలిగోట్ వద్దే ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ……ఫలించిన ఎంపీ అర్వింద్ చొరవతో…….. ఈ ఏడాది నుండే తరగతులు ప్రారంభం…

తీవ్ర రాజకీయ దుమారం రేపిన నవోదయ విద్యా సంస్థ ఏర్పాటు కు ఎట్టకేలకు అడ్డంకులు తొలిగాయి. జక్రాన్ పల్లి మండలం కాలిగోట్ వద్దే నవోద ఏర్పాటు కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఈ మేరకు నవోదయ విద్యాలయాల శాశ్వత మయు తాత్కాలిక స్థలాలకు సంబంధించి అవసరమైన చర్యలు ప్రారంభించాలని నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ లేఖ రాశారు. ఎంపీ అర్వింద్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.


నిజామాబాద్ జిల్లాలో శాశ్వత భవన నిర్మాణానికి జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 1063 లో ప్రభుత్వం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వ్యూలు ఇచ్చేసింది.


కానీ ఈ ఏడాదే తరగతులు నిర్వహించాలని ఎంపీ అర్వింద్ ఒత్తడి చేయడంతో తాత్కాలిక వసతి కొరకు నాగారం శివారులోని ప్రభుత్వ డైట్ కళాశాల కోసం జిల్లా కలెక్టర్ నుంచి ప్రతిపాదనలకు సైతం కేంద్రం ఆమోదం తెలిపింది.

అందుకే ఏడాది నుంచే తరగతులు మొదలు పెట్టేలా పనులు కానున్నాయి జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని ఎలాంటి వివాదాలు లేని కలిగోట శివారులోని 30 ఎకరాల భూమి నవోదయ విద్యాలయ సమితి పేరుపై బదలాయింపు చేసుకోవాలని కేంద్ర అధికారులను ఎంపీ కోరారు .

అదేవిధంగా శాశ్వత మరియు తాత్కాలిక భవనాల్లో రోడ్లు, నీరు విద్యుత్ మరియు టెలికమ్యూనికేషన్ లాంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని లేఖలో ఆయన పేర్కొన్నారు.

ఈ విద్యా సంవత్సరం నుండి విద్యా సంస్థ తాత్కాలిక భవనంలో ప్రారంభమయ్యేందుకు అవసరమైన మరమ్మతుల పనుల స్థితిపై నివేదిక అందజేయాలని జవహర్ నవోదయ విద్యాలయ నిజాంసాగర్ ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.

కాగా నవోదయ విద్యాసంస్థ మంజూరు చేయడంతో పాటు ఈ సంవత్సరం నుండే తరగతులు ప్రారంభమయ్యేలా చొరవ తీసుకోవడంతో పాటు , తాత్కాలిక భవన మరమ్మత్తుల కొరకు తన యొక్క ఎంపీ నిధుల ద్వారా 20 లక్షలు మంజూరు చేసినందుకు జిల్లా ప్రజలు ఎంపీ అర్వింద్ కు ధన్యవాదాలు తెలియజేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments