కొత్త పీసీసీ కి సంబంధించి ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న కసరత్తులు శుక్రవారం ఓ కొలిక్కి వచ్చేసాయి. రెండు రోజులుగా ఢిల్లీ లోనే మకాం వేసిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటి సీఎం బట్టి విక్రమార్క లతో పార్టీ ముఖ్యనేతలు సుదీర్ఘ సమాలోచనలు జరిపారు.
మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ లు తుది రూపం ఇచ్చారని చెప్తున్నారు.
నలుగురు కీలక నేతల పేర్లు తుది పరిశీలన కు వచ్చాయి, బీసీ కోటాలో మాజీ ఎంపీ మధు యాష్కీ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ తో పాటు ఎంపీ బలరాం నాయక్ అడ్లూరి లక్ష్మణ్ ల ఎవరికి పీసీసీ బాధ్యతలు ఇవ్వాలనే విషయంలో సామాజిక కోణంలోనే కసరత్తులు జరిగాయి.
పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ గా సంస్థాగత వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించిన ఖ్యాతి ఉన్న మహేష్ గౌడ్ వైపే మొగ్గు చూపారని సమాచారం.
అదీగాక అధిష్ఠానము ఆదేశాలతో టికెట్ సైతం వదులు కున్నారు. ఎలాగో రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు డిప్యూటీ సీఎం గా యస్సి సామజిక వర్గం కు చెందిన బట్టి ఉన్నారు.
అందుకే బీసీ నేత కు పీసీసీ ఇస్తే సామాజిక సమతుల్యం పాటించినట్లు అవుతుందని అధిష్టానం అంచనా వేస్తుంది.అందుకే మహేష్ గౌడ్ కే పీసీసీ పగ్గాలు ఇవ్వడానికి అధిష్టానం సానుకూలంగా ఉంది. ఈ మేరకు కీలక నేతలకు సైతం సంకేతాలు వచ్చాయి.