ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన మాక్లూర్ మండలంలోని కల్లెడ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం…
కమ్మర్పల్లి గ్రామానికి చెందిన కడమంచి గంగు 55 రాఖీ పండగ నిమిత్తం గురువారం డికంపల్లి లో ఉంటున్న సోదరుడి ఇంటికి వచ్చింది.
తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో బస్సు కోసం వేచి ఉండగా ఏమి రాక పోయే సరికి అటునుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ను ఆపి ఎక్కింది. మరొక ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో కిడపడి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మాకూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ద్విచక్ర వాహనదారుడు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ గంగాధర్ పేర్కొన్నారు.