Monday, April 20, 2026
HomeCRIMEయునివర్సిటీ భూములు కాజేస్తున్న వారితో రిజిస్టార్ చేతులు కలిపారు ….సీపీఐ నేతల

యునివర్సిటీ భూములు కాజేస్తున్న వారితో రిజిస్టార్ చేతులు కలిపారు ….సీపీఐ నేతల

తెలంగాణ యూనివర్సిటీ ఆస్తులను కాపాడాల్సిన రిజిస్టార్ యూనివర్సిటీ భూములను చెరపట్టడానికి చూస్తున్న రియల్టర్ లతో చేతులు కలిపారని , వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నగర కార్యదర్శి ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు.

నగరంలోని ఎన్ ఆర్ భవన్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిచ్ పల్లిలో  తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ 574 ఎకరాల భూములను కేటాయించిందన్నారు.

ఆ భూముల్లో 54 ఎకరాలు తమ సొంత భూములని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్పుడు రికార్డులు రూపొందించగా, అప్పటి మంత్రి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ వరప్రసాద్  సీరియస్ గా స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వత్తాసు పలికిన తహసీల్దార్ రవికుమార్ ను సస్పెండ్ చేసారని గుర్తు చేశారు.

రియల్ వ్యాపారులు కోర్టుకు వెళితే కోర్టు సైతం తెయూ కు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు.

ఆ తరువాత వారు హైకోర్టుకు వెళ్లారని, కోర్టులో యూనివర్సిటీకి అనుకూలంగా అన్ని రికార్డులను అందించి, అందుకు తగిన విధంగా కృషి చేయాల్సిన ప్రస్తుత రిజిస్ట్రార్ యాదగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పలితంగా ఎంతో కోట్ల రూపాయల విలువైన .

54 ఎకరాల యూనివర్సిటీ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని  యూనివర్సిటీ భూమిని పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని, ఆయన డిమాండ్ చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!