HomeTelanganaNizamabadరాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవంతం చేయాలి. టీఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ అధ్యక్షులు మల్లని శివ పిలుపు

రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవంతం చేయాలి. టీఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ అధ్యక్షులు మల్లని శివ పిలుపు

రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవంతం చేయాలి టీఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ అధ్యక్షులు మల్లని శివ పిలుపు ఇచ్చారు. సోమవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో టీఎంఆర్పిఎస్ నిజామాబాద్ మల్లని శివ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు.

టీఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు ఇటుక రాజు ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో నవంబర్ నెలలో జరిగే టీఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది.

కాబట్టి సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కమిటీ అందరితో రాష్ట్ర కార్యక సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లావ్యాప్తంగా నూతన గ్రామ,మండలాల కమిటీలు ఏర్పాటు చేయాలని 30 సంవత్సరాల మాదిగల కళ నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇంకా మిగిలి ఉన్న మాదిగల సమస్యలు ఉద్యమ సమయంలో అమరులైనటువంటి అమరవీరుల లబ్ది కొరకై ఉద్యోగ సమయంలో పాల్గొన్న వివిధ కేసులు ఉన్నటువంటి వారిపై కేసులు ఎత్తివేయాలని తెలిపారు.

మరికొన్ని సమస్యల పైన రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర కార్యవర్గంలో భవిష్యత్తు కార్యచరణ ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్యాల గోవర్ధన్ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జ్ మోహన్, జిల్లా నాయకులు దారి హరీష్, టౌన్ నాయకులు రమేష్, టీఎంఆర్పిఎస్ యువసేన నాయకులు పాలెం వంశీరాజ్ ,డిచ్పల్లి మండల అధ్యక్షుడు ఆర్మూర్ నవీన్ , డప్పు కళాకారు సంఘం నాయకులు సంతోష్ మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments