నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రినీ నూతన సూపరింటెండెంట్ శ్రీనివాస్ తనిఖీ చేశారు. విభాగాల అధికారులు, సిబ్బందితో మాట్లాడారు.
ప్రధానంగా ఓపీ, ఎక్స్ రే, స్కానింగ్, అనాథ రోగుల(లావారీస్) విభాగాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించే విధంగా చేస్తామని తెలిపారు.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
