కామారెడ్డి జిల్లాకు సరిహద్దులో ఉండే బీదర్ లో దోపిడీ దొంగలు పట్టపగలే స్వైర విహారం చేసారు ఇద్దరు సెక్యూరిటీ గార్డు లను హత మార్చి సుమారు 90 లక్షలు లూటీ చేసారు .
ఎస్‌బీఐ ఏటీఎం లో డబ్బు జమ చేసేందుకు వెళ్తున్న వాహనం వెంబడించి న దోపిడీ దొంగలు వెంట ఉండే సెక్యూరిటీ సిబ్బందిపై విచక్షణారహితంగా ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.
ఈ దుర్ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరోకరికి బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం వాహనంలోని నగదు పెట్టెను దొంగలు బైక్‌పై పెట్టుకుని పారిపోయారు .
ఈ ఘటన తో బీదర్ కు సరిహద్దులో ఉండే కామారెడ్డి జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. బీదర్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఆయా పోలీస్ స్టేషన్‌లకు చెందిన పోలీసు సిబ్బంది బృందాలుగా విడిపోయి దోపడీ దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
బీదర్ వైపు నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.బీదర్ సరిహద్దులో పిట్లం నిజాం సాగర్ స్టేషన్ లున్నాయి. నాలుగు రోజుల క్రితమే పిట్లం మండల కేంద్రంలో ఏటీఎం లూటీ చేసి రూ 17 లక్షలు ఎత్తుకెళ్లారు.
తాజాగా బీదర్ లో దోపిడీ ముఠా లూటీ ఉదంతం తో సరిహద్దు లో ఉండే కామారెడ్డి జిల్లాపోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
