నిజామాబాద్ ఇంచార్జ్ గా కలెక్టర్ గా భావేష్ మిశ్రా బుధవారం చివరి పని రోజు. ఆయన భార్య ఇలా త్రిపాఠి కలెక్టర్ గా గురువారం బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఆమె ప్రసూతి సెలవు ను పొడిగిస్తారా ? లేదంటే బాధ్యతలు చేపడుతారనేది అధికారుల్లో ఆసక్తిగా మారింది. ఇంచార్జ్ కలెక్టర్ గా భవేష్ మిశ్రా బాధ్యతలు అధికారికంగా ఈ రోజు తో ముగుస్తాయి.
పాలనా వ్యవహారాల్లో తనదైన ముద్ర వేసుకున్న మిశ్రా యధావిధిగా నిర్మల్ కలెక్టర్ బాధ్యతలకు వెళ్లిపోనున్నారు.చివరి పని రోజు అయినప్పటికి బుధవారం ఆర్డీవో తహశీల్ధార్ లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.
కీలక మైన సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన ఇంచార్జ్ గా మరి కొద్దీ రోజులు కొనసాగుతారనే ప్రచారం అధికారుల్లో మొదలయింది.
కానీ ఇలా త్రిపాఠి ప్రసూతి సెలవుపొడిగింపు కు సంబంధించి ప్రధాన కార్యదర్శి నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వ్యూలు వెలుబడలేదు.ప్రభుత్వం ఆమెకు 55 రోజుల పాటు (ఆగస్టు 6, 2026 నుంచి సెప్టెంబరు 30, 2026 వరకు) ప్రసూతి సెలవు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది.
దీనితో ఆమె ప్రసూతి సెలువు బుధవారం నాటికి పూర్తీ కానుంది. ఆమె తిరిగి కలెక్టరబాధ్యతల్లోకి వస్తారా లేదా అనేది ఉత్కంఠ గా మారింది
