నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్ వాడలో గల ఎస్సీ కళాశాల బాలుర హాస్టల్ (బి) వార్డెన్ ఎం.జీవన్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు
. సంక్షేమ వసతి గృహంలో విద్యార్థుల కోసం కేటాయించిన సన్న బియ్యంను సదరు వార్డెన్ అక్రమంగా తరలిస్తున్నారని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఇంచార్జి అధికారి రాజగంగారాం సమర్పించిన నివేదిక ఆధారంగా కలెక్టర్ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
సన్న బియ్యం అక్రమ తరలింపు విషయమై సమగ్ర విచారణ జరపాలని డీ.ఎస్.సీ.డీ.ఓను ఆదేశించారు. విచారణ పూర్తయ్యే వరకు హాస్టల్ వార్డెన్ జీవన్ కార్యస్థానం వదిలి వెళ్లకూడదని సస్పెన్షన్ ఉత్తర్వులలో కలెక్టర్ పేర్కొన్నారు.
