ద్విచక్ర వాహనం పై వెళ్తున్న ఓ వ్యక్తి కుక్కను తప్పించబోయి తానే మృత్యువాత పడిన ఘటన గురువారం నిజామాబాద్ నగరంలోనీ మదవనగర్ లో చోటు చేసుకుంది.
రూరల్ పోలీస్ కథనం ప్రకారం డిచ్ పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సంకటి సందీప్(21) మున్సిపల్ కాంట్రాక్టు లో లేబర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం రాత్రి సమయంలో నిజామాబాద్ నుంచీ డిచ్ పల్లి వెళ్తున్నా సమయంలో మాదవనగర్ దగ్గర కుక్క అడ్డు రావడం తో కుక్కను తప్పించబోయి ప్రదవశత్తు కిందపడి మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాన్ని పరిశీలించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.