రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు చింత ప్రదీప్ కాన్సర్ తో బాధపడుతూ మృతి చెందారు.
పలు దినపత్రికల్లో పని చేసిన చింత ప్రదీప్ కొద్దిరోజులుగా క్యాన్సర్ తో బాధ పడుతున్నట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు.
గురువారం చికిత్స పొందుతూ చింత ప్రదీప్ మృతి చెందినట్లు తెలిపారు. ఆయన మృతి పట్ల గ్రామస్తులు, పలువురు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.