ఓ మానవ అస్థి పంజరం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది.బుదవారం కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం షేర్ ఖాన్ పల్లి గ్రామ శివారులో ఓ మనవా అస్థి పంజరం కలకలం రేపింది.
సమాచారం అందుకున్న బాన్సువాడ పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో దర్యాప్తు చేపట్టారు.గ్రామస్తులను వివరాలు సేకరించి అస్తిపంజరం ఎవరి, ఎన్ని రోజుల నుంచి పడి ఉంది అని ఆరా తీశారు. పోలీస్ లు తెలిపిన కథనం ప్రకారం.
మహమ్మద్ నగర్ మండలం తుంకి పల్లి గ్రామానికి చెందిన గుమ్మడి రవీందర్ గా గుర్తించారు. మృతుని భార్యా వదిలి వెళ్లిపోవడంతో జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటాడని బాన్సువాడ సీఐ కృష్ణ వెల్లడించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.