నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు కల్తి కల్లులో వినియోగించే మతపదార్థాలను రవాణా చేసే వ్యక్తిని పిన్ ను మరో వ్యక్తిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఉమ్మడి జిల్లాలో కల్లుడిపోలకు అల్ఫ్రాజోలo రవాణా చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన ప్రధాన సూత్రధారి , గాంధారి మండల కేంద్రానికి చెందిన వ్యక్తికి అరకిలో కు పైగా ఉన్న నిషేదిత ఆల్ఫ్రాజోలo అందిస్తుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
రామారెడ్డి మండలం కేంద్రానికి చెందిన ప్రధాన సూత్రధారి దాదాపు రెండు దశాబ్దాల కాలంగా ఉమ్మడి జిల్లాలో కల్లు డిపోలకు కృత్రిమ రసాయన కళ్ళు తయారీలో వినియోగించే క్లోరోఫామ్, డైజోపాంతోపాటు ఆల్ఫ్ర జొలం సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ ఎక్సైజ్ సూపర్టెండెంట్ అబ్బాస్ ఆలీ హయాంలోని ఒకసారి రామారెడ్డికి చెందిన పేరు మోసిన స్మగ్లర్ పట్టుబడ్డట్టు రికార్డు చెబుతున్నాయి.
తన వ్యాపారాన్ని ఉమ్మడి జిల్లాతో పాటు పోరుగు జిల్లాలకు విస్తరించి హైదరాబాద్ వరకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినట్టు తెలిసింది. పార్టీలకతీతంగా కల్లు సొసైటీలో ఉన్న రాజకీయ నాయకులు కల్లు డిపోలపై దాడులు జరగకుండా ప్రధాన సూత్రధారులు దొరక్కుండా మత్తు కల్లును తయారు చేస్తున్నారు.
పట్టుబడ్డ మొత్తు పదార్థాల రవాణా సూత్రధారికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన ఒక మాజీ ప్రజా ప్రతినిధి బంధువు కాగా, రెంజల్ మండలంలో కల్లు డిపో నిర్వహిస్తున్న మాజీ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ దగ్గర బంధువు అని తెలిసింది. ఉమ్మడి జిల్లాలో కల్తికల్లు మాఫియా ను శాసిస్తున్న రాజకీయ నాయకులు మంగళవారం రాత్రి నుంచి ప్రధాన సూత్రధారుని తప్పించే పనిలో పడ్డారు.