గణతంత్ర దినోత్సవం నాడు జెండా ముందే బైఠాయించి నిరసన కు దిగాడు. కుట్ర చేసి ప్రతిమా రాజ్ ను ఆసుపత్రి బాధ్యతల నుంచి తప్పించారని ఆరోపిస్తూ రుద్రూర్ సమీకృత మండల కార్యాలయం లో ఓ యువకుడు హల్ చల్ చేసాడు.
అధికారులు జెండా ఆవిష్కరించి వెళ్ళగానే ఓ యువకుడు జెండా వద్ద బైఠాయించారు నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి సూపరెండెంట్ గా సమర్థవంతంగా పనిచేసిన డాక్టర్ ప్రతిమరాజ్ ను ఓ ప్రైవేట్ ఆసుపత్రి నడిపే డాక్టర్ కుట్ర చేసి తన ఇగో తో అధికార పార్టీ అండ చూసుకొని మహిళా డాక్టర్ ను తప్పించారని సదురు యువకుడు ఆగ్రహం వ్యక్తం చేసాడు.
ఆసుపత్రి లోతన ఆధిపత్యం ఉండడానికే తన చెప్పు చేతుల్లో ఉండే డాక్టర్ ను సూపరెండెంట్ గా నియామకం అయ్యేలా చక్రం తిప్పారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు
