నగరంలోని తాళం వేసి ఇంట్లో చోరీ జరిగింది. ఈ సంఘటన నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే..గణేష్ నగర్ కాలనిలో ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి ఇంటికి తాళం వేసి హైదారాబాద్ వెళ్ళారని తెలిపారు. దీంతో గుర్తు తెలియని దుండగులు తాళం పగల గొట్టి ఇంట్లోకి చొరబడి సుమారు మూడు తులాల బంగారం అపహరించినట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు రూరల్ ఎస్ఐ అరీఫ్ ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.
