HomeTelanganaNizamabadరేపు జిల్లాకు టీపిసిసి అధ్యక్షుడు రాక...

రేపు జిల్లాకు టీపిసిసి అధ్యక్షుడు రాక…

టీపిసిసి అధ్యక్షుడి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రేపు జిల్లా కు వస్తున్న మహేష్ కుమార్ గౌడ్ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి ఘన స్వాగతం తెలపాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ పిలుపునిచ్చారు.

గురువారం నగరంలోని పాత కలెక్టర్ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించిన మహేష్ కుమార్ గౌడ్ అంచులంచెలుగా ఎదుగుతూ నేడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎదగడం గర్వంగా ఉందని ఆయన తెలిపారు.

శుక్రవారం నిర్వహించే బహిరంగ సభకు ఆయనతోపాటు ఏడుగురు రాష్ట్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు కూడా ఆయనతోపాటు వస్తున్నారని పేర్కొన్నారు.

అలాగే జిల్లాలోని ప్రతి నియోజకవర్గ నుండి అధిక సంఖ్యలో ప్రజలను ఈ కార్యక్రమాన్ని కి హాజరయ్యేలా చూడాలని ఆయనపార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాన్ని కి వివిధ నియోజకవర్గాల నుంచి సుమారు 20,000 మందికి పైచిలుకు కార్యకర్తలు వస్తారని పేర్కొన్నారు.ఈ సభను కాంగ్రెస్ శ్రేణులు అందరూ విజయవంతం చేయాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో,గడుగు గంగాధర్,తాహిర్బీన్ హంధాన్,నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవ వేణు, నరాల రత్నాకర్, జిల్లా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారునిజామాబాద్ షెడ్యూల్, రూట్ మ్యాప్…

టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ మధ్యాహ్నము ఒంటిగంటకు అంగల్ వైట్ టోల్ వద్దకు చేరుకుంటారు. అక్కడినుంచి మాధవ్ నగర్ సాయిబాబా గుడిలో 1:30 నిమిషాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి బోర్గాం బ్రిడ్జి వద్దకు చేరుకొని అక్కడ నుంచి భారీ ర్యాలీ ప్రారంభిస్తారు.

ఆ ర్యాలీ,బోర్గాం బ్రిడ్జ్ వైపు వినాయక నగర్, పులాంగ్ చౌరస్తా, నిఖిల్ సాయి హోటల్, ముందు నుంచి ఎల్లమ్మ గుట్ట చౌరస్తా, మీదుగా పాత కలెక్టర్ మైదానంలోకి చేరుకొని భారీ బహిరంగ సభ లో పాల్గొంటారు.వాహనాల పార్కింగ్

..భారీ బహిరంగ సభకు విచ్చేసే కార్యకర్తలు,నాయకులు,వారి వాహనాలను పాత కలెక్టర్ కార్యాలయం, ఎల్లమ్మ గుట్ట చౌరస్తా ఆర్టీసీ స్థలం, పాత ఎంపీడీవో కార్యాలయం లో పార్కింగ్ చేయవలసిందగా కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments