డ్రైనేజీలో పడిపోయిన ఓ లేగదూడను ట్రాఫిక్ హోంగార్డ్ బయటకు తీసి కాపాడి మానవత్వం చాటుకున్నారు.
నగరంలోని వీక్లీ మార్కెట్లో డ్రైనేజీలో ఒక గోమాత పడి 10 గంటలు కావస్తుందని స్థానికులు ట్రాఫిక్ హోంగార్డు జీవన్ సింగ్ కి తెల్పడంతో స్థానికంగా ఉన్న ముగ్గురు నలుగురు వ్యక్తుల సహాయంతో ఆ దూడ ని తాడుతో డ్రైనేజి బయటకి సురక్షితంగా తీయడం జరిగింది.
అక్కడ ఉన్న స్థానికులు ట్రాఫిక్ హోంగార్డు జీవన్ సింగ్ కి కృతజ్ఞతలు తెలిపారు. జీవన్ సింగ్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ,ఇన్స్పెక్టర్ ప్రసాద్ అభినందించారు.
