నిజామాబాద్ నగరంలోని బాబన్ సాహెబ్ పహాడ్ పహాడ్ వద్ద కొత్త వంతెన మీద రాకపోకలు మంగళవారం మొదలయ్యాయి. గురువారం రంజాన్ పర్వదినం ఉన్న నేపథ్యంలో స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని యం ఐ యం నేతలు బిడ్జ్ మీద రాకపోకలు మొదలు పెట్టించారు. లోకసభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వంతెన పనులు ఎలా మొదలు పెట్టిస్తారని కొందరు అధికారుల దృష్టి కి తెచ్చారు.
అయితే తాము ప్రారంభోత్సవం చేయలేదని కేవలం పండగ రద్దీ ని దృష్టిలో పెట్టుకొని ప్రజల రాకపోకల కు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేశామని యంఐయం నేతలు చెప్తున్నారు ఈ ప్రాంతంలో నిజాం కాలం నాటి వంతెన పక్కనే రెండేళ్ల క్రితం కొత్త వంతెన పనులు మొదలయ్యాయి. అప్పటి ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా బిడ్జ్ పనులకు శంకుత్సాపన చేసారు.