గురువారం రంజాన్ పండుగ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ దారి మళ్లిస్తున్నామని పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ పేర్కొన్నారు.ఖిల్లా ఈద్గా, బోధన్ బస్టాండ్ ఈద్గా, పులాంగ్ ఈద్గాలలో, ముస్లీం లు రంజాన్ ప్రార్ధనలు చేస్తారని ఉదయం 6 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ దారి మళ్లింపులువుంటుందన్నారు
1) బోధన్ వైపు వెళ్లేవారు :
ఆర్.టి.సి బస్ స్టాండ్ నుండి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శివాజీ చౌక్, గంజ్, నిజాం కాలని మీదుగా అర్సాపల్లి నుండి బోధన్ కు వెళ్లాలి.
2) హైదరాబాద్ నుండి బోధన్ వైపు వెళ్లేవారు:
మాదవనగర్ బై పాస్ నుండి కంఠేశ్వర్ బైపాస్, న్యూ కలెక్టరేటు ద్వారా అర్సావల్లి మీదుగా బోధనకు వెళ్లాలి.
3) బోధన్ నుండి నిజామాబాద్ వచ్చేవారు:
అర్సావల్లి సర్కిల్ నుండి న్యూ కలెక్టరేటు మీదుగా కంఠేశ్వర్ బైపాస్ , ఎన్.టి.ఆర్ సర్కిల్, ఆర్.టి.సి బస్ స్టాండ్కు రావాలి.
నగర ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి మాతో సహకరించాలన్నారు