HomeCRIMEకవిత కు అరెస్టు సానుభూతి వుందా …..అరా తీస్తున్న సర్వే ఏజెన్సీ ?

కవిత కు అరెస్టు సానుభూతి వుందా …..అరా తీస్తున్న సర్వే ఏజెన్సీ ?

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు వ్యవహారం లో లోకసభ ఎన్నికల తెరమీదికి వచ్చేలా ఉంది. లిక్కర్ కేసులో కవిత అరెస్టు ను బిఆర్ యస్ పార్టీ ఈపాటికే బీజేపీ రాజకీయ కుట్ర గా పేర్కొంటుంది.అధినేత కెసిఆర్ ఇప్పటిదాకా పరామర్శ చేయపోయిన వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ హరీష్ లు మొదట్లో ఢిల్లీ వెళ్లి ఈడీ కస్టడీ లో కవిత ను రెండు మార్లు కలసి వచ్చారు.

ఆ తరువాత బిఆర్ యస్ నేతలెవ్వరూ అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. అయితే కవిత అరెస్టు ను నిరసిస్తూ జిల్లాలోనూ ఆందోళనలకు పార్టీ పిలుపు యిచ్చింది. కానీ నిరసనలు మొక్కుబడిగా జరిగాయి. చివరికి జాగృతి ప్రతినిధులు సైతం ఈ నిరసనలకు మొఖం చాటేశారు అధికారం ఉన్నన్ని రోజులు ఆమె వెన్నంటే ఉన్న కవులు రచయిత లు మేధావులు సైతం లైట్ తీసుకున్నారు. పార్టీ వర్గాల వైపు నుంచి కవిత అరెస్టు మీద గగ్గోలు పెట్టె లేని పరిస్థితి నెలకొంది.

లోకసభ ఎన్నికల నేపథ్యంలో కవిత అరెస్టు పరిణామాలు ఎలా వుంటాయనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. అరెస్టు ప్రభావం ఏ మేరకు వుంటుందనేది బి ఆర్ యస్ అంచనాలో ఉంది.ఈ మేరకు సర్వే సంస్థ రంగంలోకి దిగింది. నిజామాబాద్ లోకసభ నియోజకవర్గంలో ఈ సంస్థ జాతీయ మీడియా ప్రతినిధులుగా చెలామణి అవుతూ ప్రజలను అరా తీస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు ను మీరెలా చూస్తున్నారని అడుగుతున్నారు. బిఆర్ యస్ చెప్తున్న విధంగానే ఇది బీజేపీ కుట్ర గా భావిస్తున్నారా అనే పదే పదే అడుగుతున్నారని సమాచారం.

కవిత ప్రస్తుతం తీహార్ జైలు లో రిమాండ్ లో ఖైదీ గా ఉన్నారు. ఆమె రిమాండ్ ను ఉగాది పండగ రోజే పొడిగించారు. కానీ అదే రోజు సర్వే ప్రతినిధులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అరెస్టు ప్రభావం ఎలా ఉందొ వాకబు చేయడం గమనార్హం. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవిత అరెస్టు అవుతారని బీజేపీ నేతలే ప్రచారం చేసారు. కానీ అదే అదనుగా కెసిఆర్ సెంటిమెంట్ రగిలిస్తాడని ఢిల్లీ పెద్దలు వెనకడుగు వేశారు. కానీ అరెస్టు చేయక పోవడమే బీజేపీ ని రాజకీయంగా కోలుకోలేని విధంగా నష్టం చేసిందని గ్రహించారు.

అందుకే లోకసభ ఎన్నికలున్నా సరే అరెస్టు చేశారు. ఇప్పడు ఆమె అరెస్టు ఫై ప్రజల్లో సానుభూతి వచ్చిందా లేదా అనేది బిఆర్ యస్ బీజేపీ లు అరా తీస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత 2019 లోకసభ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఈసారి ఎన్నికలో అన్నీ తానై పనిచేసి అర్వింద్ ను ఓటమికి స్కెచ్ వేశారు. కానీ కార్యక్షేత్రంలో కి దిగడానికి ముందే ఆమె తీహార్ జైలు కు వెళ్ళక తప్పలేదు. కానీ ఆమె అరెస్టు తాలూకు సానుభూతి ఏ మేరకు వుంటుందో లోకసభ ఎన్నికలో తేలుతుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments