సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో గురువారం ఉపాధి హామీ పనుల్లో విషాదం చోటుచేసుకుంది.ఉపాధి పనులకు వెళ్లిన తల్లీకూతురు మృత్యువాత పడ్డారు.
బండరాళ్లు మీద పడడంతో తల్లి కందారపు సరోజన, కూతురు అన్నారి మమత మృతి, పలువురికి గాయాలుసిద్దిపేట్ జిల్లా అక్కన్న పేట్ మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన కొంత మంది కూలీలు ఉపాధి హామీ పనుల్లో భాగంగా గురువారం ఉదయం పనులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక్కసారిగా మట్టి దిబ్బ కూలిపోయింది. ఈ మట్టి దిబ్బల కింద పడి ఇద్దరు కూలీలుప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగించి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
