కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరపల్లి శివారులో విషాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని పల్లెవారి కుంటలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
మృతులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రీన్ సిటీకి చెందిన 10 ఏళ్ల సంతోష్, శివలుగా గుర్తించారు. పిల్లలు ఆడుకుంటూ ఉంటే ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయినట్లు ప్రాథమిక సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ హఠాన్నిరణయానికి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
